For Money

Business News

నిఫ్టికి నేడు మద్దతు?

ఇవాళ నిఫ్టి స్వల్ప నష్టాలు లేదా స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చిప్‌ షేర్ల ఉత్సాహంతో కోప్సి నాలుగు శాతంపైగా లాభంతో ఉంది. ఇక మన మార్కెట్లు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న రీతిలో సాగుతున్నాయి. వారంలో రెండు రోజులు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ గోల ఉంటోంది. ఇవాళ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ డెరివేటివ్స్‌ క్లోజింగ్స్‌. దీంతో సూచీల కదలికలకు బ్రేక్‌ పడుతున్నాయి. ఇన్వెస్టర్లు షేర్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. టాటా గ్రూప్‌ షేర్లలో ఇవాళ రివకరీ రావొచ్చని భావిస్తున్నారు. అన్ని కంపెనీలు నైపుణ్యమున్న మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఉన్నందున చంద్ర సెంటిమెంట్‌ చాలా రోజులు ఉండదని మార్కెట్‌ భావిస్తోంది. మరోవైపు వచ్చే నెల నుంచి MSCIలో మార్పులు వస్తున్నాయి. MSCI నుంచి BIL, SBI CARDS, ASTRAL వైదొలగుతుండగా, లారస్‌ ల్యాబ్‌, గ్రో, లెన్స్‌ కార్ట్‌, అదానీ ఎనర్జి షేర్లకు సూచీలో చోటు దక్కనుంది. ఇవాళ NBFC కౌంటర్లలో ర్యాలీ వస్తుందేమో చూడాలి. జియో ఫైనాన్స్‌కు చెందిన జియో క్రెడిట్‌లోబ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు 49.9 శాతం వాటా తీసుకోనుంది. షేర్లు,వారెంట్ల ద్వారా రూ. 18,268 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నిన్న క్యాష్‌ మార్కెట్‌ క్లోజింగ్‌ తరవాత ఏబీ క్యాపిటల్‌ షేర్‌లో కూడా అనూహ్య మార్పులు వచ్చాయి. జియో డీల్‌తో ఇతర ఎన్‌బీఎఫ్‌సీ వ్యాల్యుయేషన్‌లో పాజిటివ్‌ మార్పునకు ఛాన్స్‌ ఉంది. ఇక ఇవాళ అల్ట్రాటెక్‌ సిమెంట్‌లో రూ. 1919 కోట్ల బ్లాక్‌ డీల్‌కు ఛాన్స్‌ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రమోటర్‌ సంస్థ కొంత వాటా విక్రయించే వీలు ఉంది.

Leave a Reply