For Money

Business News

చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ ప్లాంట్?

చైనాకు చెందిన దావో ఈవీటెక్‌ (DAO EVTech) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తయారీ ప్లాంట్‌ నెలకొల్పాలని యోచిస్తోంది. ఈమేరకు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దాదాపు పది ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తారు. తొలుత సొంత అవసరాల కోసం వాహనాలను తయారు చేస్తామని, ఆ తరవాత ఇక్కడి నుంచి అమెరికా, యూరప్‌కు ఎగుమతి చేస్తామని కంపెనీ అంటోంది. ప్రస్తుతం చైనాలో ఉన్న ఎగుమతి ప్లాంట్‌ను ఇండియాకు మారుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అంటే దేశీయ డిమాండ్‌ కోసం చైనాలో ప్లాంటు, విదేశీ మార్కెట్ల కోసం భారత్‌ ప్లాంట్‌ పనిచేస్తుందన్నమాట. పెట్టుబడి వివరాలు మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు దేశ వ్యాప్తంగా తమ వాహనాల అమ్మకానికి ఏర్పాట్లు కూడా చేస్తోంది ఈ కంపెనీ. వచ్చే ఏడాది జనవరికల్లా తమ వాహనాలను మార్కెట్‌ చేస్తామని అంటోంది.