For Money

Business News

IRCTC: మరో 20 శాతం డౌన్‌

గత కొన్ని నెలులుగా ఐఆర్‌సీటీసీ షేర్‌ను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తూ వచ్చింది. మరి ఇపుడు అమ్ముతోందా అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో సాగుతోంది. నిన్న దాదాపు 25 శాతం క్షీణించిన ఐఆర్‌సీటీసీ ఇవాళ మరో 20 శాతం క్షీణించింది. చిత్రమేమిటంటే.. 15 శాతం లోయర్‌ సీలింగ్‌ వద్ద కొనుగోలుదారులు లేరు. ఇపుడు 20 శాతం లోయర్‌ సీలింగ్‌ రూ. 4451ని తాకింది. తరవాత కోలుకుని రూ. 4464 వద్ద అంటే 18 శాతం నష్టంతో ట్రేడవుతోంది. కాని ఇక్కడ కూడా కొనుగోలుదారులకన్నా అమ్మకందారులు అధికంగా ఉన్నారు. చూస్తుంటే 20 శాతం సీలింగ్‌కు చేరే అవకాశముంది. రూ.6,396 నుంచి రూ. 4,451కు క్షీణించడంతో ఇటీవల ఈ కౌంటర్‌ ఎంటర్‌ అయినా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.