For Money

Business News

సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు

గృహ అవసరాల కోసం వాడే పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఓ ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం నుంచి సామన్య ప్రజలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎల్లపుడూ జనానికి అందులోబాటులో ఉంచడమే తమ లక్ష్యమని అన్నారు. అలాగే డీజిల్‌ ఎగుమతులపై లీటర్‌కు రూ. 21.5 చొప్పున ఎగుమతి సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 29.5 చొప్పున పెంచారు. దీనివల్ల దేశయంగా వీటి సరఫరా సమృద్ధిగా ఉంటుందని అన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంటుకు నోటిఫై చేసినట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.