For Money

Business News

బులియన్‌ మళ్ళీ కళకళ

అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్‌ ధరలు ఇవాళ మళ్ళీ పెరిగాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో బంగారం భారీగా పెరిగింది. 1.36 శాతం లాభంతో ఔన్స్‌ బంగారం ధర 1964 డాలర్లకు చేరింది. అలాగే వెండి 2.9 శాతం పెరిగి 25.91 డాలర్లకు చేరింది. డాలర్‌ ఇవాళ స్థిరంగా ఉంది. పెద్దగా మార్పుల్లేవ్‌. డాలర్‌తో పోలిస్తే మన మార్కెట్‌లో రూపాయి ఇవాళ కాస్త బలంగా ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌ స్థాయిలో మన మార్కెట్‌లో బులియన్‌ పెరగలేదు. అయినా ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ నెల కాంట్రాక్ట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.255ల లాభంతో రూ.52,022 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి కూడా రూ. 1036 పెరిగి రూ. 69,300 వద్ద ట్రేడవుతోంది.