For Money

Business News

బులియన్‌ డౌన్‌

అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్‌ ధరలు తగ్గడం, డాలర్‌ రూపాయి బలపడటంతో బంగారం, వెండి ధరలు మన మార్కెట్‌లో బాగా తగ్గాయి. ఇవాళ డాలర్‌తో రూపాయి దాదాపు అర శాతం దాకా బలపడింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర రెండు శాతంపైగా క్షీణించి 1673 డాలర్లకు చేరింది. అలాగే వెండి కూడా 3 శాతంపైగా క్షీణించి 19.60 డాలర్లకు పడిపోయింది.
ఫ్యూచర్‌ మార్కెట్‌లో
ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బులియన్‌ ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ.1013 తగ్గి రూ. 50947 వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం 50901ని కూడా తాకింది. పొజిషనల్‌ ట్రేడింగ్‌ కోసం బంగారం కొనుగోలు చేయొచ్చు. అయితే ఇపుడు ఓవర్‌బాట్‌లో ఉన్నందున 51596 వద్ద సపోర్ట్‌ ఉంది. అక్కడ దాకా వస్తుందేమో చూసి కొనండి. పైగా ఈ స్థాయి దిగువకు వెళితే మాత్రం భారీ అమ్మకాల ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ స్థాయిలో కొనేసమయంలో స్టాప్‌లాస్‌ పెట్టుకుని కొనండి.
ఇకవెండి విషయానికొస్తే .. కిలో వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ.1705 తగ్గి రూ. 59080 వద్ద ట్రేడవుతోంది. కొద్దిసేపటి క్రితం రూ. 58806ని కూడా తాకింది. ఇక వెండి విషయంలో పొజిషనల్‌ ట్రేడింగ్‌ చేసేవారు 58360 లేదా 57803 దాకా వస్తుందేమో చూడండి. వెండి కూడా పొజిషనల్‌ ట్రేడింగ్‌కు కొనుగోలు చేయొచ్చు. అయితే 56,766 వద్ద కూడా సపోర్ట్‌ ఉంది. అయితే 56280 దిగువకు వస్తే అమ్మండి. లేదంటే ఈ స్థాయిని స్టాప్‌లాస్‌ పెట్టుకుని కొనుగోలు 56766 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చు.