రూ.1,392 తగ్గిన వెండి
డాలర్ పెరగడంతో పాటు ఆర్థికవృద్ధి రేటు మందగిస్తుందన్న వార్తలతో బులియన్ మార్కెట్లో అమ్మకాలు సాగుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 102 వైపు పరుగులు తీస్తోంది. డాలర్ రెండేళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో పాటు చైనాలో అనేక నగరాల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నారు. దీంతో వృద్ధి రేటు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెటల్స్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బులియన్ ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ వచ్చాయి. అమెరికాలో ఔన్స్ బంగారం ధర గత నెలలో 2000 డాలర్లను తాకగా ఇవాళ 1895 డాలర్లకు క్షీణించింది. వెండి 23.67 డాలర్లకు పడింది. మన మార్కెట్లో ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర రూ.877 తగ్గి రూ. 51,384 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి రూ. 1392 తగ్గి రూ.65154 వద్ద ట్రేడవుతోంది.