For Money

Business News

ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌

ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు ఇస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆఫర్‌కు ట్విటర్‌ అంగీకరించింది. మొత్తం డీల్ 4400 కోట్ల డాలర్లు (రూ. 3,38,184 కోట్లు)గా నిర్ణయించారు. డీల్‌ తరవాత ట్విటర్‌ ప్రైవేట్‌ కంపెనీగా మారిపోతుంది. కొత్త ఫీచర్స్‌తో ట్విటర్‌ను మరింత గొప్పగా తీర్చుదిద్దుతానని ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. డీల్‌ తరవాత ట్విటర్‌ షేర్‌ 5.7 శాతం పెరిగి 51.70 డాలర్లకు చేరింది. మస్క్‌ ఆఫర్‌ ప్రకటించినపుడు అప్పటి ధరకు 40 శాతం ప్రీమియంకు ప్రకటించారు. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి రాత్రి 51.70 డాలర్లకు చేరింది. మస్క్‌ ఆఫర్‌ చేసిన 54.20 డాలర్లకు ఈ షేర్‌ త్వరలోనే రానుంది. గత ఏడాది ట్విటర్‌ 70 డాలర్ల వద్ద ట్రేడైంది. అంటే చౌకగానే ట్విటర్‌ కంపెనీ మస్క్‌కు దక్కిందనే చెప్పాలి. కంపెనీ విలువను ఇన్వెస్టర్లు సరిగా అంచనా వేయనపుడు… ఇలా ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి పెద్ద కంపెనీలు ఈజీగా వెళ్ళిపోతాయనిబోయర్‌ వ్యాల్యూ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోనాథన్‌ బోయర్‌ అన్నారు. ఈ కంపెనీకి కూడా ట్విటర్‌లో వాటాలు ఉన్నాయి.