బీఎస్‌ఈలో EGR ట్రేడింగ్…

షేర్లు, బాండ్ల మాదిరిగానే బంగారాన్ని ఇక ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ (EGR)ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) తన ఫ్లాట్‌పాంలో EGRలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై EGRల ట్రేడింగ్‌కు అవసరమైన టెక్నాలజీని సిద్ధం చేసినట్లు బీఎస్ఈ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ వెల్లడించారు. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందాక…EGRల ట్రేడింగ్‌ను ప్రారంభిస్తామని పాటిల్ వెల్లడించారు. ఇవాళ జరిగే సెబీ బోర్డు సమావేశంలో వీటిపై ఒక ప్రతిపాదనను ఆమోదించనున్నారు. దీని తర్వాత EGR అమలులోకి రానుంది. ఇప్పటి వరకు మన మార్కెట్లలో గోల్డ్ డెరివేటివ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లలో మాత్రమే ట్రేడింగ్‌ను అనుమతిస్తున్నారు. ఇపుడు EGRలను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న ఇతర సెక్యూరిటీల మాదిరిగానే వీటికి కూడా అలాంటి ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ఫీచర్లు ఉంటాయి.