For Money

Business News

యూరో కిక్‌… లాభాల్లోకి వచ్చిన నిఫ్టి

యూరో మార్కెట్ల వరకు లాభనష్టాలతో తీవ్ర ఒడుదుడుకులకు లోనైన నిఫ్టి యూరో ఫ్యూచర్స్‌ గ్రీన్‌లోకి రాగానే పుంజకుంది. మధ్యాహ్నం 12.40 గంలకు నిఫ్టి ఒక్కసారిగా పెరిగి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,762ని తాకింది. ఇపుడు మిడ్ క్యాప్‌తో సహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ సూచీ 0.65 శాతం లాభంతో ఉంది. బ్యాంక్‌ నిఫ్టి ఇప్పటికీ గ్రీన్‌లో ఉన్నా… నామ మాత్రమే. యూరో మార్కెట్లు ప్రస్తుతానికి గ్రీన్‌లో ఉన్నా… కీలక మార్కెట్లు డల్‌గా ఉండటం కాస్త కలవర పరుస్తోంది. నిఫ్టి షేర్లకన్నా మిడ్‌ షేర్లే చాలా దూకుడుగా ఉన్నాయి. టాటా వపర్‌ మల్టి ఇయర్‌ హై రూ.183 వద్ద ట్రేడవుతోంది. ఐడియా, ఐఆర్‌సీటీసీ కూడా నాలుగు శాతం దాకా లాభపడ్డాయి.