రూ. 14 లక్షల కోట్లు పాయే..
ఇవాళ స్టాక్ మార్కెట్లోఎంత భయానక వాతావరణం నెలకొందంటే… ప్రతి ఇన్వెస్టర్ అమ్మడానికి ప్రయత్నించినవారే. దీంతో ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీలో భారీ సంఖ్యలో షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇవాళ 3057 షేర్లు ట్రేడవగా 2758 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇందులో 227 షేర్లు మాత్రమే గ్రీన్లో ముగిశాయి. 95 షేర్ల ధరల్లో మార్పు లేదు. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ 2704 పాయింట్ల నష్టంతో ముగిసింది. ప్రతి పది షేర్లలో 9 షేర్లు నష్టాలతో ముగిశాయి. కేవలం ఒకే ఒక్కరోజులో బీఎస్ఈలో లిస్టయిన షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లు క్షీణించింది. నిన్న బీఎస్ఈ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.256 లక్షల కోట్లు ఉండగా, ఇవాళ రూ. 242 లక్షల కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరి 16 నుంచి లెక్కలోకి తీసుకుంటే ఇన్వెస్టర్ల సంపద రూ. 16 లక్షల కోట్లు తగ్గింది.