BSE: మార్కెట్ క్యాప్ రూ. 250 లక్షల కోట్లు
భారత స్టాక్ మార్కెట్‌లో సూచీలు ఆల్ టైమ్ హైకి చేరి కొత్త రికార్డు సృష్టించాయి. నిఫ్టి 17000 స్థాయిని దాటగా, సెన్సెక్స్ 57,550ని దాటింది. ఇప్పట్లో వడ్డీ రేట్లను పెంచమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో పాటు ఇవాళ సాయంత్రం దేశీయ జీడీపీ గణాంకాలు వస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో చాలా జోష్ కన్పించింది. కోవిడ్ మునుపటి స్థాయికి జీడీపీ వృద్ధి రేటు వెళుతుందన్న అంచనాలతో భారీగా కొనుగోళ్ళు జరిగాయి. అలాగే ఆర్బీఐ కూడా జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 21.6 శాతం ఉంటుందని పేర్కొనడంతో మార్కెట్ కొత్త జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 249.98 లక్షల కోట్లకు చేరింది.