యాక్సిస్ బ్యాంక్ కొనొచ్చా?
సిటీ బ్యాంక్ ఇండియా కన్జూమర్ బిజినెస్‌ను యాక్సిస్ బ్యాంక్ నిన్న కొనుగోలు చేసింది. ఈ డీల్ కోసం 160 కోట్ల డాలర్లు చెల్లించనుంది. ఈ డీల్ తరవాత యాక్సిస్‌బ్యాంక్ షేర్ల భవిష్యత్తుపై వివిధ బ్రోకింగ్ సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ప్రముఖ బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ ఈ డీల్ వల్ల బ్యాంక్ ఎదుర్కొనబోయే పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఈ షేర్ పెరిగేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 750 వద్ద ట్రేడ్ అవుతోంది. జెఫరీస్ ఇచ్చిన టార్గెట్ ధర రూ. 1040. సీఎల్ఎస్ఏ కూడా యాక్సిస్ బ్యాంక్ షేర్‌ను కొనుగోలు చేయమనే సిఫారసు చేస్తోంది. ఈ షేర్ టార్గెట్ ధర రూ. 1,080. సిటీ బ్యాంక్ ఇండియా బిజినెస్ డీల్ వల్ల బ్యాంక్‌కు అనుకూల ప్రయోజనాలు ఉన్నాయని సీఎల్ఎస్ఏ అంటోంది. మోర్గాన్ స్టాన్లీ కూడా ఈ షేర్‌ను కొనుగోలు చేయమని చెబుతోంది. అయితే టార్గెట్ ధర రూ. 930గా పేర్కొంది. కొత్త డీల్ బ్యాంక్‌కు అనుకూలంగా ఉన్నా… సిటీ బ్యాంక్ నుంచి బదిలీ అయ్యే కస్టమర్లను నిలుపుకోవడం బ్యాంక్ వద్ద ఉన్న పెద్ద సమస్య అని పేర్కొంది.