క్రూడ్ మళ్ళీ జూమ్….
తగ్గినట్లే తగ్గి క్రూడ్ ఆయిల్ ఇవాళ భారీగా పెరిగింది. మనదేశానికి వచ్చిన ఇబ్బంది ఏమిటంఒటే… ఈలోగా డాలర్ ఇండెక్స్ భారీగా పెరగడం. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 96.50 ప్రాంతంలో. ఈ సమయంలో బ్రెంట్ క్రూడ్ 2.6 శాతం పెరిగి 81.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ తగ్గిన వల్ల కలిగిన ప్రయోజనాలు.. డాలర్‌తో పోయాయన్నమాట. ఇక ఇవాళ క్రూడ్‌ఎందుకు పెరిగిందంటే… తన స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఎస్‌పీఆర్) నుంచి చైనా, జపాన్, భారత్, దక్షిణ కొరియా, బ్రిటన్ దేశాలకు 5 కోట్ల బ్యారెళ్ళ క్రూడ్‌ను విడుదల చేస్తున్న అమెరికా ప్రకటించింది. ఈ వార్తను మార్కెట్ ఇది వరకే డిస్కౌంట్ చేసింది. ఈ ప్రకటన వచ్చినపుడు క్రూడ్ 85 డాలర్ల ప్రాంతంలో ఉండేది. కాని డాలర్ ఇండెక్స్ 95 ప్రాంతంలో ఉండేది. అమెరికా నిర్ణయం తరవాత ఒపెక్ చేసిన ప్రకటన క్రూడ్‌కు మరింత ఊతం ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్ సరఫరా పెంచడంలో ఎలాంటి అర్థం లేదని ఒపెక్ స్పష్టం చేసింది.