For Money

Business News

భారీగా క్షీణించిన క్రూడ్‌ ఆయిల్

మాంద్యం తరుముకు వస్తోందన్న వార్తలతో క్రూడ్‌ ధరలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా క్రూడ్‌ 90 డాలర్లు దాటిన ప్రతిసారీ ఒత్తిడి వస్తోంది. ఈనెలలోనే దాదాపు 98 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్‌ ధర ఇపుడు 87.28 డాలర్లకు క్షీణించింది. ఇవాళ ఒక్క రోజే దాదాపు మూడు శాతం క్షీణించింది. ఈ ఏడాది జూన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 123 డాలర్లు దాటిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. గత సెప్టెంబర్‌ నెల చివర్లో ఏకంగా 83 డాలర్లకు పడిపోయింది. ఆ తరవాత పెరుగుతున్నా 100 డాలర్లను దాటలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ క్రూడ్‌ తగ్గుతున్న ప్రతిసారీ డాలర్‌ పెరిగేది. కాని గత నెల రోజుల నుంచి డాలర్‌తో పాటు క్రూడ్‌ కూడా తగ్గుతోంది. అంటే భారత్‌ వంటి దిగుమతి ప్రధాన దేశాలకు చాలా చవగ్గా క్రూడ్‌ లభిస్తోందన్నమాట. ఈ స్థాయిలో క్రూడ్‌ ధరలు తగ్గుతున్నా… రష్యా నుంచి డిస్కౌంట్‌తో క్రూడ్‌ దిగుమతి చేసుకున్నా… ఇంకా మన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమకు నష్టాలు వస్తున్నాయని… ధరలు తగ్గించకపోవడం విశేషం.