బోధి ట్రీ చేతికి అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్
జేమ్స్ మర్డోక్, ఉదయ్ శంకర్లు నెలకొల్పిన బోధి ట్రీ సిస్టమ్స్ కోట కేంద్రంగా పనిచేస్తున్న అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 60 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 4590 కోట్లు. మెజారిటీ వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది. బోధి ట్రీతోపాటు అలెన్ కూడా అసలు ఎంత వాటా తీసుకున్నది వెల్లడించలేదు. గత వారం ముకేష్ అంబానీకి చెందిన వయాకామ్18లో కూడా బోధి ట్రీ భారీ పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. మనదేశంతోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లో అలెన్ బాగా విస్తరిస్తోంది.ప్రస్తుతం ఈ సంస్థకు 46 నగరాల్లో 138 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎడ్టెక్ రంగంలో విస్తరించడానికి వినియోగిస్తామని అలెన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవ్ మహేశ్వరి అన్నారు.