For Money

Business News

పబ్లిక్ ఇష్యూకు ‘బోట్‌’ సన్నాహాలు

బోట్‌ బ్రాండ్‌ పేరుతో ఇయర్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు విక్రయిస్తున్న ఇమాజిన్‌ మార్కెటింగ్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రూ. 2000 కోట్ల ఇష్యూ కోసం సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ మొత్తంలో రూ. 900 కోట్ల తాజా ఈక్విటీ ద్వారా సమీకరిస్తారు. మిగిలిన రూ. 1100 కోట్ల విలువైన సమాన షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు అమ్ముతారు. ఇందులో సౌత్‌ లేక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే ఇన్వెస్టరు రూ.800 కోట్ల విలువైన షేర్లను అమ్మనుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించే మొత్తంలో చాలా భాగం రుణాలు తిరిగి చెల్లించేందుకు వినియోగిస్తారు. న్యూఢిల్లీకి చెందిన ఈ కంపెనీ తన వ్యాల్యూయేషన్‌ 150 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్ల మధ్య ఉంటుందని అంటోంది. క్వాల్కమ్‌ వెంచర్స్‌ నుంచి ఈ కంపెనీ రూ. 50 కోట్లను గత ఏడాది ఏప్రిల్‌లో సమీకరించింది. అపుడు ఈ కంపెనీ వ్యాల్యూయేషన్‌ రూ. 2200 కోట్లుగా లెక్క గట్టారు. ఇపుడు తన వ్యాల్యూయేషన్‌ను అయిదు నుంచి ఆరు రెట్లు పెరిగిందని అంటోంది.