రేపటి నుంచి బ్లూ చెక్ సర్వీస్
బ్లూ చెక్ సర్వీసులను ట్విట్టర్ రేపటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తోంది. కేవలం సబ్స్క్రిప్షన్ పొందిన వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందిస్తారు. ఈ సేవలను పొందినవారు ఇకపై హెచ్డీ వీడియోలను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లో భాగంగా ప్రభుత్వం, కంపెనీలు, సామాన్య ప్రజలకు వివిధ రంగుల బ్యాడ్జ్‌లను కేటాయించనున్నారు. కంపెనీలకు బంగారు రంగు, ప్రభుత్వాలకు గ్రే రంగు, సామాన్య పౌరులకు బ్లూ టిక్‌లు ఇవ్వనున్నారు. చెక్‌లు యాక్టివేట్ చేసే ముందు మాన్యువల్‌గా చెక్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ బ్లూ సభ్యత్వాన్ని వెబ్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుందని ట్విటర్ పేర్కొంది. ఈ సబ్స్క్రిప్షన్ ధర నెలకు 8 అమెరికన్ డాలర్లు. యాపిల్ సంస్థ విధించిన 30 శాతం పన్నుల కారణంగా ఐఓఎస్‌లో దీని ధర మరింత ఎక్కువగా ఉంటుంది.
బ్లూ చెక్ వల్ల లాభాలు
ట్విట్లను ఎడిట్ చేసుకోవచ్చు. 1080పీలో వీడియోలను అప్లోడ్ చేయవచ్చు.
రిప్లై, మెన్షన్, సెర్చ్‌లో వీరికి ప్రత్యేక ప్రాధాన్యం
సాధారణ వినియోగదారులతో పోలిస్తే సగం ప్రకటనలే ఉంటాయి
కొత్త ఫీచర్లకు కూడా ప్రాధాన్యం
సబ్స్క్రైబర్లు తమ హ్యాండిల్, డిస్ప్లే పేరు లేదా ప్రొఫైల్ ఫొటోను మార్చుకోవచ్చు.
ఇలా మార్పులు చేసినపక్షంలో వారి ఖాతాను తిరిగి సమీక్షించే వరకు బ్లూ చెక్ మార్క్ తాత్కాలికంగా తీసేస్తారు.