For Money

Business News

డ్రోన్‌ఆచార్య పబ్లిక్‌ ఆఫర్‌ రేపే

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు శంకర్‌ శర్మ, మంగిన శ్రీనివాస రావు, వీసీ కార్తిక్‌లు ఇన్వెస్ట్‌ చేసిన డ్రోణ్‌ ఆచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ రేపు ప్రారంభం కానుంది. ఈనెల 13 నుంచి 15 వరకు ఈ ఇష్యూ ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఇష్యూ షేర్‌ ధరల శ్రేణ ఇరూ. 52 నుంచి రూ. 54. మొత్తం 62.90 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. ఇందులో 8.98 లక్షల షేర్లు హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్‌కు కేటాయిస్తుండగా, 11.94 షేర్లు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్క కేటాయిస్తున్నారు. ఇవి పోగా కేవలం 20.92 లక్షల షేర్లు మాత్రమే పబ్లిక్‌కు ఆఫర్‌ చేస్తున్నారు. ఇది ఎస్‌ఎంఈ ఐపీఓ కావడంతో కనీసం 2000 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే కనీస పెట్టుబడి రూ. 1.08 లక్షలు. ఇంకా పలువురు ప్రముఖ ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఈ ఇష్యూ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అవుతుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించే నిధులను డ్రోన్లు, సెన్సర్‌ కొనుగోలు, తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ… ఈ ఆఫర్‌ గురించి ప్రస్తావిస్తూ… తాను రూ. 54 ధరకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశానని… రీటైల్‌ ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీ వల్ల ప్రయోజనం పొందాలని ఇదే ధరకు ఆఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా సర్వేలు, డెలివరీసలు, నిఘా వంటి పరిశ్రమల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిందని… రానున్న సంవత్సరాల్లో ఈ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. అతి తక్కువ కాలంలో ఈ కంపెనీ బాగా రాణించిందని శంకర్‌ శర్మ అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 3.09 కోట్ల అమ్మకాలపై రూ. 72.06 లక్షల లాభాన్ని ఆర్జించింది. వంద శాతం దేశీయ టెక్నాలజీతో డ్రోన్లు తయారు చేసేందుకు డ్రోన్‌ఆచార్య ప్రయత్నిస్తోంది. చాలా మంది విశ్లేషకులు ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేయమనే సలహా ఇస్తున్నారు.