జొమాటొ చేతికి బ్లిన్కిట్?
బ్లిన్కిట్ (పాత పేరు్ గ్రోఫోర్స్)ను జొమాటొ టేకోవర్ చేసే అవకాశముంది. కేవలం షేర్ల మార్పడితో బ్లిన్కిట్ను జొమాటొ టేకోవర్ చేసుకోవచ్చని ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. గత ఏడాది బ్లిన్కిట్లో జొమాటో 10 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టి పది శాతం వాటాను తీసుకుంది. జొమాటొ వ్యాల్యూయేషన్ ఆధారంగా బ్లిన్కిట్ విలువ 70 కోట్ల డాలర్ల నుంచి 80 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. విలీనంలో భాగంగా బ్లిన్కిట్కు చెందిన ప్రతి పది షేర్లకు ఒక జొమాటొ షేర్ ఇచ్చేలా విలీన ప్రతిపాదన ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాది జూన్ నుంచి నవంబర్ మధ్య కాలంలో బ్లిన్కిట్తో పాటు షిప్రాకెట్లో 7.5 కోట్ల డాలర్లు, మ్యాజిక్ పిన్లో 5 కోట్ల డాలర్లు, కల్ట్ఫిట్లో 10 కోట్ల డాలర్లను జొమాటొ ఇన్వెస్ట్ చేసింది.