For Money

Business News

పాత ఎగవేత… కొత్తగా వెలుగులోకి

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో మోసాలకు అంతే లేకుండా ఉంది. ఎపుడూ ఏదో కొత్త మోసం బయటపడుతూ ఉంటుంది. తాజాగా ఐఎల్&ఎఫ్ఎస్ త‌మిళ‌నాడు ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్‌ (ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌సీటీఎన్‌పీ) తీసుకున్న రూ.2,060.14 కోట్ల రుణం మొండి బ‌కాయిగా మారింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో ఈ మోసాన్ని బ్యాంక్‌ వెల్లడించింది. ఈ కంపెనీకి సంబంధిచి సరిగ్గా నెల రోజుల క్రితం పంజాబ్ & సింధ్ బ్యాంక్ రూ. 148 కోట్ల రుణాన్ని ఎన్‌పీఏ ప్రకటించింది. 2018లో ప‌లు సంస్థల‌కు నిధులు స‌మ‌కూర్చిన బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ (ఐఎల్&ఎఫ్ఎస్‌).. డిఫాల్ట్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఐఎల్&ఎఫ్ఎస్ రుణాలు రూ.94 వేల‌కోట్లని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2021 మార్చి నెలాఖరుకు ఈ కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ. 7181 కోట్లు ఉన్నట్లు సమాచారం.