For Money

Business News

వచ్చేనెలలో బిడ్స్‌కు ఆహ్వానం

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పైకి ఏమీ జరగనట్లు కన్పిస్తున్నా… ఇప్పటికే ఆసక్తిగల ఇన్వెస్టర్లతో రెండు దఫాలుగా సంప్రదింపులు పూర్తి చేసింది. మరికొంత మందితో చర్చల తరవాత డిసెంబర్‌కల్లా అమ్మకం ప్రక్రియకు ప్లాన్‌ను సిద్ధం చేయనుంది. నవంబర్‌ చివరి వారంలో, డిసెంబర్‌ మొదటివారంలో ప్రి బిడ్‌ కన్సల్టేషన్స్‌ జరిగినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఈ భేటీకి ప్రధాన స్టీల్‌ కంపెనీలు హాజరైనట్లు సమాచారం. వైజాగ్‌ స్టీల్‌ కొనేందుకు టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ గ్రూప్‌లు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏడు కంపెనీలు వైజాగ్‌ స్టీల్‌ కొనేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. జనవరి నెలాఖరులోగా ఆసక్తి గల కంపెనీల నుంచి బిడ్స్‌ను కేంద్రం ఆహ్వానించనుంది. స్టీల్‌ ప్లాంట్‌తో పాటు ఆ కంపెనీకి ఉన్న 22,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌పై ప్రైవేట్‌ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయి. పైగా గంగవరం పోర్టు సమీపంలో ఉండటంతో అదానీ ఆసక్తి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈపోర్టును అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే.