For Money

Business News

లాభాల్లో SGX NIFTY

ఇవాళ ద్రవ్యోల్బణ డేటా, రేపు ఫెడ్‌ వడ్డీ పెంపు నేపథ్యంలో రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు ఒకటిన్నర శాతం వరకు లాభంతో ముగిశాయి. డాలర్‌ 105 దిగుకు రాగా, క్రూడ్‌ ఆయిల్‌ రాత్రి పుంజుకుంది. బ్రెంట్‌ క్రూడ్‌ 79 డాలర్లకు చేరువలో ఉంది. అంతకుముందు యూరో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ అర శాతంపైగా నష్టంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 0.84 శాతం మినహా మిగిలిన మార్కెట్ల లాభాలు అర శాతంలోపే ఉన్నాయి. అయితే మార్కెట్లలో పెద్ద ఉత్సాహం లేదు. సింగపూర్ నిఫ్టి నామ మాత్రం 30 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. పారిశ్రామిక వృద్ధి రేటు దారుణంగా ఉన్న నేపథ్యంలో నిఫ్టి ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.