For Money

Business News

కడపలో JSW స్టీల్‌ ప్లాంట్‌

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్​ఐపీబీ) సమావేశంలో రూ.23 వేల 985 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు ఈ సమావేశంలోఆమోద ముద్ర పడింది. రెండు విడతల్లో మొత్తంగా రూ.8, 800 కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ అంటోంది. మొదటి దశలో ఏడాదికి 10 లక్షల టన్నులు, రెండో విడతలో 20 లక్షల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. ఇంకా అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థల పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకూ ఆమోదం తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో రూ.23 వేల 985 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.