BEL అప్డేట్ ఇదే….
డిఫెన్స్ షేర్లలో మిడ్ క్యాప్ షేర్ బీఈఎల్ గత వారం ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. గత శుక్రవారం షేర్ కూడా భారీగా పెరిగి 4 శాతం లాభంతో రూ. 426.20 వద్ద ముగిసింది. కంపెనీ పనితీరు మార్కెట్ అంచనాలకు మించడంతో పాటు కంపెనీ షేర్ల విభజనకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో రూ. 10 ఉన్న షేర్ల ముఖ విలువ రూ.5గా మారనుంది. దీంతో ఇన్వెస్టర్ల వద్ద ఉన్న ప్రతి ఒక షేరు.. రెండు షేర్లుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో బీఎఈల్ కౌంటర్లో కొనుగోళ్ళు పెరిగే ఛాన్స్ ఉంది. రూ. 460 టార్గెట్‌తో ఈ షేర్లను కొనుగోళ్ళు చేయొచ్చని పలు బ్రోకింగ్ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి. అయితే రూ. 409ని స్టాప్ లాస్‌గా ఉంచుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ప్రముఖ టెక్నికల్ అనలిస్ట్ ప్రకాష్ గాబా సిఫారసు చేశారు. ఇవాళ ఉదయం ఆయన సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్లో మాట్లాడుతూ ఈ షేర్‌ను రూ. 435 లేదా రూ. 450 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని అన్నారు. రూ. 422 స్టాప్ లాస్. ఒకట్రెండుల్లోనైనా ఈ షేర్ తాను సూచించిన టార్గెట్‌ను చేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
