BSNLలో బ్రాండ్ బ్యాండ్ విభాగం విలీనం
భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో విలీనం కానుంది. బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పూర్వార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆలిండియా గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐజీఈటీఓఏ ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. బీఎస్ఎన్ఎల్కు ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ ) నెట్వర్క్ఉంది. బీబీఎన్ఎల్ విలీన ప్రతిపాదనతో మరో 5.67 లక్షల కిలోమీటర్ల ఎఎఫ్సీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22 ) సేవల ఆదాయం రూ .17,000 కోట్లను దాటే అవకాశముందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. 2019-20లో బీఎస్ఎన్ఎల్ రూ .15,500 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, 2020-21లో నష్టాన్ని రూ .7,441 కోట్లకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇంచుమించు ఇదే మొత్తంలో నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉందని పూర్వార్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని నెలల్లో 4 జీ సేవలను వినియోగదార్లకు అందిస్తామని అన్నారు.