ట్విటర్‌కు దివాళ ప్రమాదం?
తన చేతికి వచ్చిన తరవాత ట్విటర్ కంపెనీలో సమూల మార్పులు తెస్తున్నారు. కాని జెట్ స్పీడుతో మార్పులు తేవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతుండగా… ఇపుడు కంపెనీకి రుణం ఇచ్చినవారు కూడా లబోదిబో అంటున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఇక నుంచి ఉండబోదని. ప్రతి ఒక్క ఉద్యోగి వారానికి 40 గంటల పాటు ఆఫీస్‌లో ఉండాల్సిందేనని ఎలాన్ మస్క్ ఆదేశించారు. ఇవన్నీ కంపెనీ ఆదాయం పెంచేందుకేనని ఆయన అంటున్నానరు. అయితే ట్విటర్‌కు రుణాలు ఇచ్చిన కంపెనీలు మాత్రం విశ్వసించడం లేదు. ఎలాన్ మస్క్ హెచ్చరించినట్లు ట్విటర్ దివాళా తీసే భయంతో… కంపెనీలు తాము ఇచ్చిన రుణాలు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. డాలర్‌కు 60 సెంట్లకు చొప్పన రుణాలు అమ్మేందుకు రుణదాతలు సిద్ధమైనట్లు బ్లూమ్ బర్గ్ పేర్కొంటే. అంటే ట్విటర్‌కు రూ.100 కోట్లు రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థలు… వాటిని రూ. 60 కోట్లకు అమ్మేందుకు రెడీ అవుతున్నాయన్నమాట. అంటే 40 శాతం నష్టం భరించేందుకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు రెడీ అవుతున్నాయి.