For Money

Business News

పెరుగుతున్న వడ్డీ రేట్లు

ఆర్బీఐ గవర్నర్‌ ఎన్ని కబుర్లు చెప్పినా.. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. పరిస్థితిని గమనించిన బ్యాంకులు క్రమంగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. డిపాజిట్లతో పాటు రుణాలపై కూడా వడ్డీని పెంచుతున్నాయి. ఇపుడున్న వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వడం లాభదాయకం కాదని చాలా బ్యాంకులు భావిస్తున్నాయి. క్రమంగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. నిజంగా షేర్‌ మార్కెట్‌లో పతనం మొదలైతే… సురక్షిత పెట్టుబడుల్లో బ్యాంకు షేర్లు ఒకటి. వ్యాపారం తగ్గినా… లాభదాయకతలో పెద్ద మార్పు రాదు. ఇతర కంపెనీల మాదిరిగా వీటికి ముడి పదార్థాల గోల ఉండదు. ఇది పూర్తిగా సేవల రంగం. కాబట్టి బ్యాంకులు లాభాలు పెంచుకునేందుకు ఇప్పటికే మార్గాలు వెతుకున్నాయి. ఒక్కో బ్యాంక్‌ వడ్డీ రేటు పెంచుతోంది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) కస్టమర్లకు ఎంసీఎల్‌ఆర్‌ (MCLR) తో ముడిపడిన రుణాలపై వడ్డీ రేటును పెంచింది. వివిధ కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను బీఓబీ 0.05 శాతం మేరకు పెంచినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. కొత్త రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ ఆర్‌ 7.35 శాతం, ఒక నెలకు 6.50 శాతం, మూడు నెలలకు 6.50 శాతం, ఆరు నెలలకు 7.10 శాతానికి పెంచినట్లు బ్యాంక్ పేర్కొంది.