For Money

Business News

బజాజ్‌ ఆటో షాక్‌

గత రెండు రోజుల నుంచి బజాజ్‌ ఆటో కౌంటర్‌లో చాలా మంది అనలిస్టులు బజాజ్‌ ఆటో షేర్‌ను కొనాల్సిందిగా రెకమెండ్‌ చేశారు. నిన్న రరూ. 3881 వద్ద క్లోజైన ఈ షేర్‌ను రూ. 4000 టార్గెట్‌గా సిఫారసు చేశారు. మంచి డివిడెండ్‌, క్యాష్‌ బ్యాలెన్స్‌ ఉన్న కంపెనీ కావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొన్నారు. ఇవాళ ఈ షేర్‌ రూ. 3919కి చేరింది. ఇదే స్థాయిలో కొనసాగుతుండగా… 2.45 ప్రాంతంలో బజాజ్‌ ఆటోకంపెనీ నుంచి వచ్చిన సమాచారంతో షేర్‌ నిమిషాల్లో నేరుగా రూ. 3602కు క్షీణించింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే షేర్‌ ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని తాకింది. ఈలోగా స్క్వేర్‌ ఆఫ్‌ టైమ్‌ కావడంతో స్వల్పంగా కోలుకుని రూ. 3693 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే షేర్‌ 4.83 శాతం క్షీణించింది. దీనికి ప్రధాన కారణంగా ఇవాళ సమావేశమైన కంపెనీ బోర్డు షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను వాయిదా వేయడం. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు కాస్త లోతుగా అధ్యయనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని… కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఈ ప్రతిపాదనను వాయిదా వేసినట్లు కంపెనీ తెలిపింది.