For Money

Business News

దుమ్మురేపిన యాక్సిస్‌ బ్యాంక్‌

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ అంచనాలను మించిన పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో రూ. 3614 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ. 1117 కోట్లు. అంటే 224 శాతం పెరిగిందన్నమాట. మార్కెట్ విశ్లేషకులు రూ. 3150 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం కూడా 17 శాతం వృద్ధితో రూ. 8653 కోట్లకు చేరింది. ఫీజుల రూపేణా వసూలు చేసిన మొత్తం 15 శాతం పెరిగి రూ. 3344 కోట్లకు చేరింది. ఆవిధంగా మూడో త్రైమాసికంలో వడ్డీయేతర ఆదాయం ద్వారా బ్యాంక్‌ రూ. 3840 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బ్యాంక్‌ నిర్వహణా లాభం రెండో త్రైమాసికంతో పోలిస్తే 4 వాతం, గత ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగి రూ. 6162 కోట్లకు చేరింది. నష్టాల కోసం చేసిన ప్రొవిజన్‌ రూ. 927 కోట్ల నుంచి రూ.790 కోట్లకు తగ్గింది.