అవతార్‌కు దక్షిణాది కష్టాలు
దక్షిణాదిలో అవతార్-2 సినిమా ప్రదర్శనకు పలు థియేటర్లు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మల్టిప్లెక్స్‌లలో ఈ సినిమా విడుదల అవుతున్నా… సింగిల్ థియేటర్లలో విడుదలకు థియేటర్ యజమానులు నిరాకరించినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను విడుదల చేస్తున్న సినిమా నిర్మాతనే. వాల్ట్ డిస్నీకి చెందిన ట్వెంటియత్ సెంచురీ ఫాక్స్ ఈ సినిమాను నిర్మించడమే గాక… మనదేశంలో స్వయంగా విడుదల చేస్తోంది. సాధారణంగా హాలివుడ్ మూవీలు ప్రదర్శిస్తే కలెక్షన్స్‌లో షేర్ సమానంగా పంచుకుంటారు. అంటే నిర్మాతకు 50 శాతం, థియేటర్ యజమానికి 50 శాతం. కాని ఈ సినిమాకు సినిమా నిర్మాత 70 శాతం షేర్ అడగడంతో చాలా థియేటర్లు నిరాకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో అవతార్-2 మూవీ 600 నుంచి 700 స్క్రీన్స్‌లో విడుదదల కావాల్సి ఉండగా. కేవలం 200 నుంచి 250 స్క్రీన్స్‌పైనే విడుదలు అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా చాలా మంది థియేటర్ యజమానులు 70 శాతం షేర్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం.