For Money

Business News

మళ్ళీ తెరచుకోనున్న కేజీఎఫ్‌ గనులు!

మూతపడిన కోలార్‌ గోల్ట్‌ ఫీల్డ్స్‌ కేజీఎఫ్ తలుపులు మళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోనున్నాయి. బెంగళూరుకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార గోల్డ్‌ ఫీల్డ్‌ (కేజీఎఫ్)​లో మళ్లీ బంగారం వెలికి తీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఇక్కడ బంగారం కోసం తవ్విన దాదాపు 5 కోట్ల టన్నుల ప్రాసెస్‌ చేసిన ఖనిజం ఉంది. అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఆధారంగా ఆ ఖనిజం నుంచి బంగారం తీశారు. అయితే ఈ ప్రాసెస్‌ చేసి ఖనిజం నుంచి బంగారాన్ని తీసే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీ ఉన్న కంపెనీల నుంచి మళ్ళీ టెండర్లను పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేజీఎఫ్​లో 210 కోట్ల డాలర్ల విలువైన.. బంగారు నిక్షేపాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోందిన. బంగారంతో పాటు.. పల్లాడియంను కూడా వెలికితీయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు లేదా ఆరు నెలల్లో కేంద్రం బిడ్స్‌ను ఆహ్వానించే అవకాశముంది. రెండోసారి ఖనిజాన్ని ప్రాసెస్‌ చేసి బంగారం వెలికి తీసే టెక్నాలజీ, అనుభం విదేశీ కంపెనీలకే ఉందని ప్రభుత్వం అంటోంది. దేశీయ కంపెనీలతో జతకలిసి లేదా కన్సార్టియంలో చేరి విదేశీ కంపెనీలు కేజీఎఫ్‌లో బంగారం వెలికి తీసే అవకాశముంది.