For Money

Business News

19 నుంచి గోల్డ్‌ బాండ్లు

భారత రిజర్వు బ్యాంక్‌ మరోసారి గోల్డ్‌ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్‌-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను అమ్మనుంది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 10 వరకు జారీ చేయనున్నది. ఈ గోల్డ్‌ బాండ్లను కమర్షియల్‌ బ్యాంకులు (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, రిజినల్‌ రూరల్‌ బ్యాంకులు మినహా), స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్సేంజ్‌లు(ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ)ల్లో విక్రయించనున్నాయి. కొత్త సర్కులర్‌ ప్రకారం ఈ గోల్డ్‌ బాండ్‌లను కేవలం వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, యూనివర్సిటీలు, ఛారిటబుల్‌ సంస్థలు మాత్రమే విక్రయిస్తారు. కనీసం ఒక గ్రాము కొనాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వ్యక్తులైతే 4 కిలోల వరకు అమ్ముతారు. అలాగే హెచ్‌యూఎఫ్‌లకు కూడా. అయితే ట్రస్ట్‌లకు మాత్రం 20 కిలోల వరకు అమ్ముతారు. ధర గురించి వివిస్తూ… సబ్‌స్క్రప్షన్‌ అమల్లో ఉన్న కాలానికి ముందు ఐబీజేఏ నిర్ణయించే రేటుకు మూడు రోజుల సగటును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జువెల్లర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (IBJA) ప్రతి రోజూ 0.999 నాణ్యత గల అంటే స్టాండర్డ్‌ బంగారం ధరను ప్రకటిస్తుంది. ఈ ధరకు మూడు రోజుల సగటు రేటు ప్రకారం బాండ్‌లను జారీ చేస్తారు.