For Money

Business News

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వాయిదా?

వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ తరవాత సార్వత్రిక ఎన్నికలు. వీటి దృష్ట్యా వాటాల విక్రయం, ప్రైవేటీకరణను వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రతిపాదించింది.అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసినా, వాటాలను విక్రయించినా సెంటిమెంట్‌ దెబ్బతింటుందని.. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనలను వెనక్కి నెట్టాలని అధికారులు భావిస్తున్నట్లు మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ ప్రైవేటీకరణకు కేరణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. 2022-23లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 65000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాని సగం కూడా లక్ష్యం సాధించలేదు. ఇపుడు ఎన్నికలు సమీస్తున్న సమయంలో వాటాల విక్రయం, కంపెనీల విక్రయం వొద్దని మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకంట్రోల్‌ డాట్‌ కామ్‌ పేర్కొంది.