For Money

Business News

షేర్‌ మార్కెట్లు కోలుకుంటున్నా…

రాత్రి అమెరికా మార్కెట్లు చాలా వరకు నష్టాలను పూడ్చుకున్నాయి. కాని డౌజోన్స్‌ మాత్రం 0.68 శాతం లాభాలకే పరిమితమైంది. ట్విటర్‌ సీఈఓ మారడంతో అనేక టెక్‌ షేర్లు రాత్రి భారీగా పెరిగాయి. దీంతో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు భారీగా పెరిగాయి. నాస్‌డాక్‌ దాదాపు రెండు శాతం పెరిగింది. కాని ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ఆ ఉత్సాహం లేదు. నిన్న భారీగా క్షీణించిన జపాన్‌ ఇవాళ అరశాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ అమెరికాలో బాటలో ఉన్నాయి. అయితే హాంగ్‌సెంగ్‌ మాత్రం ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనాకు చెందిన పలు బ్లూచిప్‌ కంపెనీల ప్రభావం ఈ మార్కెట్‌పై పడుతోంది. సింగపూర్‌ నిఫ్టి మాత్రం స్థిరంగా ఉంది. మరి మార్కెట్‌ ప్రారంభ సమయానికి నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమౌతుందేమో చూడాలి.