అనుకున్నట్లే 0.75 శాతం పెంపు
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్.. రాత్రి మార్కెట్ అంచనాల మేరకే వడ్డీ రేట్లు పెంచింది. కీలక వడ్డీ రేటును మరో 0.75 శాతం పెంచుతున్నట్టు రాత్రి ప్రకటించింది. దీంతో గత రెండు నెలల్లో ఫెడ్ కీలక వడ్డీ రేట్లను 1.5 శాతం పెంచినట్లయింది. రిటైల్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరడంతో ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో కీలక వడ్డీ రేట్లు 2.25-2.5 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగితే అమెరికాలో ఈ ఏడాది చివరికి వడ్డీ రేట్లు 3.4 శాతానికి చేరతాయని భావిస్తున్నారు. మార్కెట్ అంచనాల మేరకు వడ్డీ రేట్లు పెరగడంతో రాత్రి అమెరికా మార్కెట్లు దుమ్ము రేపాయి. ఇటీలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా భారీ లాభాలతో ముగిశాయి.