ఆన్‌లైన్ టికెట్ల అమ్మకంపై స్టే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం హైకోర్టు కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. తమ పోర్టల్ ద్వారానే టికెట్లు అమ్మాలంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓపై కొందరు ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తుది విచారణ ఈ నెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.