For Money

Business News

కారు ఓనర్లు: కేవలం 2.8 శాతం

కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్‌ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో కూడా కారు ఉన్న కుటుంబాల శాతం జాతీయ సగటు కన్నా చాలా తక్కువ. దేశ వ్యాప్తంగా సగటున 7.5 శాతం ఇంటి యజమానులకు కారు ఉండగా, ఈ శాతం ఏపీలో కేవలం 2.8 శాతం మాత్రమే. ఏపీ కన్నా తక్కువ సగటు ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా, బీహార్‌ ఉన్నాయి. బీహార్‌ 2 శాతం మందికే కారు ఉంది. ఇక ఒడిశాలో 2.7 శాతం, పశ్చిమ బెంగాల్‌లో ఏపీకి సమానంగా 2.8 శాతం కుటుంబాలకు కారు ఉంది. దక్షిణాదిలో అత్యంత తక్కువ కుటుంబాలకు కారు ఉన్నది ఏపీలోనే. తెలంగాణలో 6.5 శాతం, తమిళనాడులోనూ 6.5 శాతం కుటుంబాలకు కారు ఉండగా, కర్ణాటకలో ఈ శాతం 9.1గా ఉంది. కేరళలో రికార్డు స్థాయిలో కారు ఓనర్ల కుటుంబాలు ఉన్నాయి. 24.2 శాతం సగటుతో దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో కేరళ ఉంది. రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్‌ ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 23.7 శాతం కుటుంబాలకు కారు ఉంది. పంజాబ్‌లో 21.9 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 22.1శాతం కుటుంబాలకు కారు ఉండగా, ఢిల్లీలో ఈ శాతం 19.4. 2019-2021 మధ్య కాలంలో నేషనల్‌ ఫ్యామిలీ, హెల్త్‌ సర్వే గణాంకాలు ఇవి.