For Money

Business News

చక్కెర షేర్లు 10 % జంప్‌…ఇంకా జోష్‌?

గత ఏడాది నుంచి చక్కెర షేర్ల పంట పండుతోంది. కొన్ని షేర్లు డబుల్‌ కాగా, మరికొన్ని అంతకన్నా బాగా పెరిగాయి. చెత్త షేర్లు కూడా 50 శాతం పైగా పెరిగాయి. ముఖ్యంగా నిన్న, ఇవాళ చక్కెర్ల షేర్లలలో దూకుడు కన్పించింది. ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉన్న కంపెనీలు, చెరకు నుంచి ఎథనాల్‌ తీసే కంపెనీల షేర్లు 10 శాతంపైగా పెరిగాయి. ముక్కిన బియ్యం నుంచి ఎథనాల్‌ తీస్తారు. అలా కాకుండా చెరకు పిప్పి నుంచి తీసే ఎథనాల్‌ ధర లీటరకు రూ.7 అధికంగా ఉంటుంది… ఇటీవల జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పాజిటివ్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో చక్కెర షేర్లు భారీగా పెరుగుతున్నాయి. మున్ముందు కూడా పెరుగుతాయా అంటే. కచ్చితంగా పెరుగుతాయని చాలా మంది అనలిస్టులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా వచ్చే మార్కెటింగ్‌ సీజన్‌లో అంటే జనవరిలో కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతి కోటా పెంచుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటాయి. ఈ సమయంలో ఎగుమతులకు అవకాశం ఇస్తే కంపెనీలకు భారీగా లాభాలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఎథనాల్‌కు మళ్ళుతున్న చెరుకు పరిమాణం కూడా బాగా పెరుగుతోందని… దీంతో దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు అధికంగా ఉన్నందున… ఎథనాల్‌ ధరలు కూడా పటిష్ఠంగా ఉన్నాయి. ఇవన్నీ పరిశ్రమకు అనుకూలమని అనలిస్టులు అంటున్నారు. ఇవాళ ఉత్తమ్‌ సుగర్‌ 8 శాతం, త్రివేషి ఇంజినీరింగ్‌ 7 శాతం, శ్రీ రేణుక సుగర్స్ 6 శాతం, శక్తి సుగర్స్‌ 5శాతం చొప్పున పెరిగాయి. ఇక ధామ్‌పూర్‌ సుగర్స్‌ 7 శాతం, ద్వారకేష్‌ సుగర్స్‌ 7 శాతం, సింభోలి సుగర్‌,రాజశ్రీ సుగర్స్‌ కూడా 5 శాతం చొప్పున పెరిగాయి.
ద్వారకేస్‌ సుగర్స్‌ ఇపుడు రూ. 101 వద్ద ఉంది. ఈ షేర్‌ రూ. 145కి చేరుతుందని ఎలరా క్యాపిటల్‌ అంచనా వేస్తోంది. లాగే బలరాంపూర్‌ చినీ షేర్‌ రూ. 445ను తాకుతుందని పేర్కొంది.