AP: మరో రూ. 2,542 కోట్ల భారం?
అధిక ధరకు విద్యుత్ కొనాల్సి రావడంతో అనుకున్న వ్యయం పెరిగిందని… సదరు పెరిగిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలుకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు వినియోగదారుల నుంచి మరో రూ.2,542.70 కోట్లు వసూలు చేసేందుకు ఏపీ ఈఆర్సీ అనుమతి కోసం దరఖాస్తు చేశాయి. 2019-20లో టారిఫ్‌లో ఈ అధిక వ్యయం వచ్చినట్లు పేర్కొంటున్నాయి. ఇందులో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) రూ.1,841.58 కోట్లు, తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.701.12 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఏపీఈఆర్సీ అనుమతి కోరాయి. దీనిపై విచారించి ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవ్వనుంది. మరోవైపు 2014-15 నుంచి 2018-19 మధ్య కాలానికి ఇదే తరహా వ్యత్యాసం అని చెప్పి వినియోగదారుల నుంచి రూ.3,669 కోట్లు అదనంగా వసూలు చేసుకుందుకు ఏపీ ఈఆర్సీ అనుమతి పొందింది. ఈ నెల బిల్లు నుంచి వచ్చే ఏడాది మార్చి ఈ మొత్తాన్ని జనం వినియోగదారుల నుంచి వసూలు చేయనుంది.
బహిరంగ మార్కెట్లో అధిక ధరకకు విద్యుత్ కొనాల్సి వచ్చినందున ఈ వ్యత్యాసం వచ్చింది.