మూడు రాజధానులపై సుప్రీంలో అప్పీల్
మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. సుప్రీం కోర్టును జగన్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆరు నెలల్లో అమరావతి అభివృధ్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం కష్టమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మూడు రాజధానుల చట్టం రద్దు చేసే అంశంలో హైకోర్టు అధికారం లేదని జగన్ ప్రభుత్వం వాదించింది. చట్టాలు చేసే విషయంలో శాసనసభకు ఉన్న అధికారులను కోర్టులు ప్రశ్నించజాలవని తన అప్పీల్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను బలహీనపరిచేలా ఉందని వాదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగిలా చూసేందుకు మూడు రాజధానులను ప్రతిపాదించినట్లు తెలిపింది.