‘ఫ్యూచర్’కు రూ.7,000 కోట్లు
దివాలా అంచుల్లో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌కు (ఎఫ్ఆర్ఎల్) మరో రూ.7000 కోట్ల రుణం ఇచ్చేందుకు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ సిద్ధమైంది. పీఈ సంస్థ సమరా క్యాపిటల్ ద్వారా ఎఫ్ఆర్ఎల్కు ఈ మొత్తం సమకూర్చేందుకు సిద్ధమైంది. జవనరి 29కల్లా రుణ సంస్థలకు రుణాలు చెల్లించాల్సి ఉన్నందున రూ. 3500 కోట్ల ఇచ్చే విషయమై ఈ నెల 22వ తేదీకల్లా తమకు స్పష్టత ఇవ్వాలని అమెజాన్‌కు ఎఫ్ఆర్ఎల్ కోరింది. దీనికి స్పందించిన అమెజాన్… తాజా పెట్టుబడులకు తాము సిద్ధమని, సమారా కేపిటల్ ఈ మేరకు పెట్టుబడి పెడుతుందని పేర్కొంది. రూ. 7000 కోట్లతో ఎఫ్ఆర్ఎల్ ఆస్తులు కొనుగోలుకు 2020 లోనే ఫ్యూచర్ గ్రూపు-అమెజాన్ – సమాచారా మధ్య మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.