For Money

Business News

ఈవారం మార్కెట్‌ను ఇవి ప్రభావితం చేస్తాయి

మార్కెట్‌ను ఈ వారం మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి కార్పొరేట్‌ ఫలితాలు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలు ఇవాళ ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లను ప్రభావితం చేయనున్నాయి.అలాగే ఇతర కార్పొరేట్‌ ఫలితాలు. ఇక రెండోది మంగళ, బుధవారం అమెరికా ఫెడ్‌ నిర్ణయం. బుధవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా మన మార్కెట్లకు సెలవు. అంటే ఫెడ్‌ నిర్ణయానికి స్పందనగా గురువారం మార్కెట్‌ ప్రారంభమౌతుంది. పైగా అదే రోజు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. అంటే డెరివేటివ్స్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది. పైగా ఫెడ్‌ నిర్ణయ ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిఫ్టికి 17500 చాలా కీలకమని టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తున్నాయి. రిలిగేర్ బ్రోకింగ్‌ సంస్థ అంచనా ప్రకారం నిఫ్టికి 17600-17350 మధ్య మద్దతు లభించే అవకాశముంది. 17500 వద్ద మద్దతుకు ఆస్కారం ఉందని మరికొన్ని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. గత వారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.10,647 కోట్ల విలువైన షేర్లను అమ్మాయి. ఈ నెలలో ఇప్పటి వరకు వీరు రూ.19,026 కోట్ల షేర్లను అమ్మేశారు. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ మరింత కీలకం కానుంది.