ఎన్సీఎల్టీకి ఫ్యూచర్స్, అమెజాన్ వివాదం
ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తాను కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి రెండేళ్ల క్రితం నాటి అనుమతులను రద్దు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఆదేశాలకు సవాలు చేస్తూ జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో అమెజాన్ పిటిషన్ వేసింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 49 % వాటా కొనుగోలు నిమిత్తం అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందానికి 2019 లో సీసీఐ అనుమతినిచ్చింది. అయితే అమెజాన్ తమ నుంచి కొన్ని వివరాలు దాచిందని పేర్కొంటూ, గత డిసెంబరులో తాను ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో పాటు, అమెజాను రూ .202 కోట్ల జరిమానాను సీసీఐ విధించిన విషయం తెలిసిందే. సీసీఐ ఆదేశాలను ఎన్సీఎల్డీటీలో అమెజాన్ సవాలు చేసింది.