For Money

Business News

Growwలో సత్య నాదెళ్ళ పెట్టుబడి

మన దేశంలోని స్టార్టప్స్‌పై విదేశీ సంస్థల ఆసక్తి పెరుగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఫిన్‌టెక్‌ సంస్థ గ్రో (Groww)లో పెట్టుబడి పెట్టారు. అలాగే ఈ కంపెనీకి ఆయన సలహాదారుగా కూడా ఉంటారు. స్టాక్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపకరించే ప్లాట్‌ఫామ్‌ అయిన ‘గ్రో’ బెంగలూరు కేంద్రంగా పనిచేస్తోంది. 2021లో గ్రో కంపెనీ రెండు దశల్లో నిధులను సమీకరించింది. గత ఏడాది ఏప్రిల్లో 8.3 కోట్ల డాలర్ల (సుమారు రూ . 622 కోట్లు), అలాగే అక్టోబరులో మరో 25.1 కోట్ల డాలర్ల (అంటే సుమారు రూ .1880 కోట్లు)ను ఈ కంపెనీ సమీకరించింది. గ్రో కంపెనీని ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివులు లలిత్ కేశ్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ కలిసి 2016లో స్థాపించారు. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు , ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌తో పాటు అమెరికా షేర్‌ మార్కెట్‌ పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌ పేరొందుతోంది.