అలోక్ షేర్ జిగేల్
అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ఇవాళ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ముగిసింది. ఈ కంపెనీ జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లలో రూ. 3300 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టిందన్న వార్తలతో ఈ షేర్ ఇవాళ పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు ఈ ప్రతిపాదనకు గతంలోనే ఆమోదం తెలిపారు. అయితే 3300 కోట్ల ప్రిఫెరెన్స్ షేర్లను కొనుగోలు చేసినట్లు కంపెనీ ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈ షేర్ ముఖ విలువ రూ. 1 కాగా, ప్రిఫెరెన్స్ షేర్లపై 9 శాతం ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 40.01 శాతం వాటా ఉంది. కార్పొరేట్ దివాలా ప్రక్రియలో భాగంగా 2019లో జేఎం ఫైనాన్షియల్ ఏఆర్సీ నుంచి ఈ కంపెనీలో వాటాను రిలయన్స్ కొనుగోలు చేసింది.