లాభాల్లో హిందాల్కో రికార్డు బద్ధలు
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో కంపెనీ జూన్‌తో ముగిసిన మూడు నెల్లలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో టర్నోవర్,లాభాలు సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 709 కోట్ల నికర నష్టం సాధించిన ఈ కంపెనీ ఈసారి ఏకంగా రూ. 2,787 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. డిమాండ్ భారీగా ఉండటంతో పాటు కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాల కారణంగా కంపెనీ టర్నోవర్ రూ. 41,358 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న టర్నోవర్ రూ. 25,283 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 64 శాతం పెరిగింది. పన్నులు, తరుగుకు ముందు లాభం (ఎబిటా) రూ. 6,790 కోట్లుగా కంపెనీ పేర్కొంది. జూన్ 30 నాటికి కంపెనీ నికర రుణాలు రూ. 10,389 కోట్లకు తగ్గాయి.