రూ. 2 వేల కోట్లతో డేటా సెంటర్
హైదరాబాద్‌లో రూ. 2000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఎయిర్టెల్ నిర్ణయించింది. తమ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డాటా సెంటర్స్ ద్వారా ఈ డాటా సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు వెల్లడించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎయిర్టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సమావేశమయ్యారు. తొలి దశలో 60 మెగావాట్ల ఐటీ లోడ్ సామర్థ్యంతో హైపర్సేల్ డాటా సెంటర్‌ను హైదరాబాద్‌లో తెస్తున్నట్టు మిట్టల్ ప్రకటించారు. డాటా సెంటర్ ఏర్పాటు చర్చలు.. నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చాయని.. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వేగంగా తీసుకున్న చర్యలే అని భారతీ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు.