For Money

Business News

అమ్మకానికి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌?

కేంద్ర ప్రభుత్వం మరో 12 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నివేదిక సిద్ధం చేసింది. ఎయిర్‌ పోర్టులను అమ్మడం ద్వారా 8 వేల కోట్ల రూపాయలు, ఎయిర్‌ పోర్టుల ఆస్తుల అమ్మకం ద్వారా మరో 20 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ఏవియేషన్‌ శాఖ భావిస్తోంది. విజయవాడ, చెన్నై, కోల్‌కతా, జైపూర్, రాయ్‌పూర్‌, ఇండోర్‌, నాగ్‌పూర్‌, జబల్‌పూర్, రాజ్‌కోట్‌, అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లను అమ్మేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బడ్జెట్‌లో చేసే అవకాశముంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అమ్మిన ఎయిర్‌పోర్టులలో చాలా వరకు అదానీ గ్రూప్‌కు వెళ్ళాయి. లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్, గౌహతి, తిరువనంతపురం, మంగళూరు ఎయిర్‌పోర్టులు అదానీ బిడ్‌ చేసి గెలిచింది.