For Money

Business News

నష్టాల్లో SGX NIFTY

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న అమెరికా మార్కెట్లు రాత్రి భారీ నష్టాలతో ముగిశాయి.
ఐటీ షేర్లతో పాటు ఎకానమీ షేర్లు కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ 1.8 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 1.56 శాతం, నాస్‌డాక్‌ 1.24 శాతం నష్టపోయాయి. రాత్రి అమెరికాలో వారాంతపు చమురు నిల్వలు అనూహ్యంగా పెరగడంతో రాత్రి క్రూడ్‌ ధరలు తగ్గాయి. డాలర్ స్థిరంగా ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 1.25 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.64 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు కూడా రెడ్‌లో ఉన్నాయి. ఇపుడు సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. ఇవాళ విక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కూడా.